మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Dharma Sastha Stotram by Sringeri Jagadguru – శ్రీ ధర్మశాస్తా స్తోత్రం (శృంగేరి జగద్గురు విరచితం)


జగత్ప్రతిష్ఠాహేతుర్యః ధర్మః శ్రుత్యంతకీర్తితః |
తస్యాపి శాస్తా యో దేవస్తం సదా సముపాశ్రయే || 1 ||

శ్రీశంకరార్యైర్హి శివావతారైః
ధర్మప్రచారాయ సమస్తకాలే |
సుస్థాపితం శృంగమహీధ్రవర్యే
పీఠం యతీంద్రాః పరిభూషయంతి || 2 ||

తేష్వేవ కర్మందివరేషు విద్యా-
-తపోధనేషు ప్రథితానుభావః |
విద్యాసుతీర్థోఽభినవోఽద్య యోగీ
శాస్తారమాలోకయితుం ప్రతస్థే || 3 ||

ధర్మస్య గోప్తా యతిపుంగవోఽయం
ధర్మస్య శాస్తారమవైక్షతేతి |
యుక్తం తదేతద్యుభయోస్తయోర్హి
సమ్మేలనం లోకహితాయ నూనమ్ || 4 ||

కాలేఽస్మిన్ కలిమలదూషితేఽపి ధర్మః
శ్రౌతోఽయం న ఖలు విలోపమాప తత్ర |
హేతుః ఖల్వయమిహ నూనమేవ నాఽన్యః
శాస్తాఽస్తే సకలజనైకవంద్యపాదః || 5 ||

జ్ఞానం షడాస్యవరతాతకృపైకలభ్యం
మోక్షస్తు తార్క్ష్యవరవాహదయైకలభ్యః |
జ్ఞానం చ మోక్ష ఉభయం తు వినా శ్రమేణ
ప్రాప్యం జనైః హరిహరాత్మజసత్ప్రసాదాత్ || 6 ||

యమనియమాదిసమేతైః యతచిత్తైర్యోగిభిః సదా ధ్యేయమ్ |
శాస్తారం హృది కలయే ధాతారం సర్వలోకస్య || 7 ||

శబరగిరినివాసః సర్వలోకైకపూజ్యః
నతజనసుఖకారీ నమ్రహృత్తాపహారీ |
త్రిదశదితిజసేవ్యః స్వర్గమోక్షప్రదాతా
హరిహరసుతదేవః సంతతం శం తనోతు || 8 ||

ఇతి శృంగేరి జగద్గురు శ్రీభారతీతీర్థమహాస్వామి విరచితం ధర్మశాస్తా స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.